
నిమ్స్ హాస్పిటల్ పై రోజురోజుకి ఒత్తిడి పెరుగుతోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు పోలేని పేదలు.. నిమ్స్ కే క్యూ కడుతున్నారు. అయితే.. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ నుంచి మొదలు పెడితే.. ఓపి వరకూ అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. ఓవైపు నిమ్స్ ట్రీట్మెంట్ పై ఫిర్యాదులు ఎక్కువవుతుంటే.. మరోవైపు వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
పేదలకు వైద్యం అంటే గుర్తుకొచ్చేది నిమ్స్ హాస్పిటల్. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ ఇస్తారనేది పేషెంట్స్ నమ్మకం. అందుకే నిమ్స్ కు ప్రతిరోజూ వందలాది మంది పేషెంట్స్ వస్తుంటారు. ప్రతి పావుగంటకు ఇక్కడ ఓ ఎమర్జెన్సీ పేషెంట్ జాయిన్ అవుతాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
కానీ రోజురోజుకు పెరుగుతున్న పేషెంట్స్ కు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతోంది నిమ్స్. డాక్టర్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీస్ లో ఆలస్యం పేషెంట్స్ ప్రాణాలమీదకు తెస్తోంది. ఒక్క పేషెంట్ ను చూడ్డానికి కనీసం రెండు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నారు బంధువులు. ఇటీవల మెట్ పల్లికి చెందిన పేషంట్ మోహన్ సర్జరీ కోసం ఎల్ ఓసి తెచ్చుకున్నా.. బెడ్ లేట్ గా ఇవ్వడంతో... అతను చనిపోయాడంటూ... బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరో పేషెంట్ ఆపరేషన్ థియేటర్ కు నడుచుకుంటూ వెళ్లి.. వెంటిలేటర్ లో చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. ఆపరేషన్ సక్సెస్ అని మొదట చెప్పి.. తరువాత సీరియస్ అంటూ హంగామా చేసారంటున్నారు బంధువులు.
ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ విషయంలోనే కాదు.. ఎలెక్టివ్ సర్జరీలు, డాక్టర్ కన్సల్టేషన్ విషయంలోనూ విమర్శలు వస్తున్నాయి. ఇక వెంకటేశ్వర్లు అనే పేషంట్ కు న్యూరో కు సంబంధించి ఆపరేషన్ జరగకుండానే... జరిగిందని కేస్ షీట్ లో రాయడం దుమారం రేపింది. అనస్తీషియా, మెడిషిన్ ఇవ్వడంతో పాటు... మళ్లీ కుట్లు కూడా విప్పాలన్నట్లు కేస్ షీట్ లో రాసారు. అంతేకాక.. ఆపరేషన్ కోసం డాక్టర్లు కట్టించుకున్న పైసలు కూడా తిరిగి ఇవ్వడం లేదని వాపోతున్నాడు బాధితుడు.
ఇలా రోజురోజుకి నిమ్స్ ట్రీట్మెంట్ పై విమర్శలు పెరుగుతున్నాయి. నిమ్స్ లో కొందరు వైద్యులు, అధికారులు... నిమ్స్ పేరును పాడుచేస్తున్నారంటున్నారు. నిమ్స్ పై ఒత్తిడి ఉన్నప్పుడు.. దానికి ప్రత్నామ్యాయంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు రోగులు. ఇక కొందరు వైద్యులు రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో.. ఎంక్వైరీ కమిటీలు వేసి.. చేతులు దులుపుకున్నారు.
నిమ్స్ లో డైలీ 2 వేల నుంచి 3 వేల వరకూ ఓపి, వంద వరకూ ఇన్ పేషంట్లు ఎడ్మిట్ అవుతున్నారు. 2 వేల వరకూ బెడ్స్ ఉండగా.. అన్ని బెడ్స్ ఫుల్ అయ్యి, బెడ్స్ కొరత కూడా ఉంది. నిమ్స్ లో 158మంది ఫ్యాకల్టీ ఉండగా, 70 వరకూ సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు. ఇక మిగతా స్టాఫ్ 3 వేల వరకూ ఉన్నారు. అయితే.. ప్రస్తుతం వైద్యుల కొరత, బెడ్స్ కొరత ఉండడంతో.. నిమ్స్ పై ఒత్తడి పెరిగింది. నిమ్స్ లో కొత్త బిల్డింగ్ కు ఇప్పటికే.. 15 వందల కోట్ల రూపాయిలు కేటాయించింది సర్కార్. త్వరగా పనులు ప్రారంభించి బెడ్స్ ను పెంచాలంటున్నారు రోగులు.