పేషెంట్ల డైట్ ఛార్జీలు రెట్టింపు

పేషెంట్ల డైట్ ఛార్జీలు రెట్టింపు

ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు మెరుగైన చికిత్సతో పాటు పోషకాహాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు ఒక్కో పేషెంట్కు ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీలను రూ.56 నుంచి రూ.112కు పెంచింది. సాధారణ రోజులకు అందించే డైట్ ఛార్జీలను రూ.40 నుంచి రూ.80కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.43.5కోట్లు కేటాయించింది. హైదరాబాద్లోని 18 ప్రభుత్వ దవాఖానాల్లో రోగులతో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇకపై నిత్యం 18,600 మంది అటెండెంట్లకు రెండు పూటలా భోజనం అందనుంది. ఇందుకోసం ఏటా 38.66కోట్లు ఖర్చు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. 

బాలింతల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రబుత్వం ఆ లోపాన్ని నివారించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పేరుతో పోషకాహారాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కిట్స్ ద్వారా ఏటా లక్షా 25వేల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని బడ్జెట్లో ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 61 మార్చురీల ఆధునికీకరణ కోసం రూ.32.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

For more news..

అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఈ సారి బడ్జెట్ లో ఏముందంటే.?