రంగారెడ్డి MLC : TRS నేత పట్నం మహేందర్ రెడ్డి విజయం

రంగారెడ్డి MLC : TRS నేత పట్నం మహేందర్ రెడ్డి విజయం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా MLC ఎన్నికల్లో TRS నాయకుడు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు.

రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 31 న ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ ఓటేశారు. రాజేంద్ర నగర్ వెటర్నరీ హాస్పిటల్ లో ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ జరిగింది. గంటన్నరలోనే ఫలితం తేలింది. మొత్తం 806ఓట్లలో.. 797 ఓట్లు పోలయ్యాయి.

కౌంటింగ్ లో… మహేందర్ రెడ్డికి 510 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 266 ఓట్లు పడ్డాయి. 21 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మెజారిటీ ఓట్లు సాధించడంతో.. టీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు.