
ఒక్కోసారి కుళాయిల నుంచి కూడా కలుషితమైన నీళ్లు వస్తుంటాయి. అలాంటి నీళ్లను వాడినప్పుడు వాటిలోని మలినాల వల్ల జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలు రావడం సహజమే.
కాబట్టి స్నానం చేసే నీళ్ల ట్యాప్‌కి లేదా షవర్‌కి ఈ ఫిల్టర్‌ని పెట్టుకుంటే అలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. దీన్ని వాటర్ సైన్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో ఐదు ఫిల్టర్లు ఉంటాయి. షవర్ మోడ్స్‌ని మూడు రకాలుగా మార్చుకోవచ్చు. దీన్ని అన్ని 1/2 అంగుళాల పైప్‌లకు బిగించుకోవచ్చు.
అందుకోసం ప్యాక్‌లోనే ఇన్‌స్టాలేషన్ కిట్ వస్తుంది. వాడకాన్ని బట్టి ఒక్క క్యాట్రిడ్జ్ 6 నెలల వరకు పనిచేస్తుంది. అవి క్లోరిన్‌తో పాటు ఇతర మలినాలను తొలగించి ఐదు దశల్లో నీటిని శుద్ధి చేస్తాయి. పైగా ఇందులో అరోమా ప్యాడ్ కూడా ఉంటుంది. అది సువాసనలను వెదజల్లుతుంది. దాన్ని రీప్లేస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫిల్టర్‌తో పాటు 10 అరోమా ప్యాడ్‌లు వస్తాయి.
ధర: రూ. 2945