చైనా నిజమైన స్వభావం బయటపడింది

చైనా నిజమైన స్వభావం బయటపడింది

డ్రాగన్‌ దూకుడుపై మండిపడిన వైట్ హౌజ్
వాషింగ్టన్: ఇండియాతోపాటు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు వ్యతిరేకంగా బీజింగ్ దూకుడు ప్రదర్శనను బట్టి కమ్యూనిస్ట్ పార్టీ నిజమైన స్వభావం బయట పడిందని అమెరికా వైట్ హౌజ్ విమర్శించింది. ఇండియా–చైనా మధ్య గల్వాన్ ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకెన్నే తెలిపారు. ‘ఇండియా‌‌–చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ప్రెసిడెంట్ ట్రంప్ కూడా గమనిస్తున్నారు. యథాతథ స్థితి పునరుద్ధరణను కోరుకుంటున్నట్లు ఇండియా, చైనా తెలిపాయి. ప్రస్తుత పరిస్థితి సద్దుమణిగి శాంతియుత వాతావరణం నెలకొనడానికి మేం మద్దతుగా ఉంటాం’ అని మెకెన్నే చెప్పారు. గత నెలలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి జరిగిన ఘర్షణలో డజన్ల కొద్దీ ఇండియా సైనికులతోపాటు చైనా జవాన్లూ మృతి చెందారని చైర్మన్ ఆఫ్ హౌజ్ సెలెక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆడమ్ స్కిఫ్ అన్నారు.