
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగానే మకిలిపురంలో పబ్లిక్ మీటింగ్‌లో... 2019లో ఓడిపోయినప్పుడు సర్వస్వం కోల్పోయి.. గుండె కోతను అనుభవించానన్నారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారాడని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.రాజోలులో మీరిచ్చిన తీర్పు ఓదార్పునిచ్చిందని తెలిపారు. 150 మందిలో మొదలైన జనసేన పార్టీకి ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారంటూ.. గోదావరి లాగానే తాను ఈ నేలను అంటిపెట్టుకొని ఉంటానని పవన్ తెలిపారు. 2024 ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని ప్రజలను కోరారు.
వైసీపీ నాయకులు కాదు.. గూండాలకు చెప్తున్నా.. మీరో నేనో ఒకరిమే ఉందామన్నారు. తనకు అధికారం ఇస్తే ..అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సాక్షిగా ఉమ్మడి గోదావరి జిల్లాలు అభివృద్ది చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్లు, వంతెనలు, రైల్వై లైన్ లు నిర్మించి శఖినేటిపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాల్లో ఓఎన్ జీసీ, రిలయన్స్ వంటి ఆయిల్ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి .. కాలుష్యం లేకుండా చేస్తానన్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ స్థాపించేందుకు ప్రధాని మోడీతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ 75 శాతం మంది స్థానికులకుఉద్యొగాలిస్తామని చెప్పారని.. కాని ఆయిల్ కంపెనీల్లో ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.
నేను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయనంటూ..తాను నేను రౌడీలకు భయపడే వ్యక్తిని కాదంటూ.. క్రిమినల్స్ ను, రౌడీలలను పులివుందులలో పెట్టుకోమన్నారు వపన్ కళ్యాణ్. జనసేన అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కలుగజేస్తామన్నారు. గోదావరి జిల్లాలను టూరిజం ప్రాంతంగా అభివృద్ది చేస్తామన్నారు. యువత ఉపాధికి ఏడాదికి 10 వేల కోట్లు కేటాయిస్తానని తెలిపారు. అయితే అవినీతి రహితమైన ప్రభుత్వం ఏర్పడాలని పవన్ కళ్యాణ్ అన్నారు.