అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్..వేడుకల్లో పవన్ కల్యాణ్

అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్..వేడుకల్లో పవన్ కల్యాణ్
  • సింగపూర్ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్న పవన్ భార్య

హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. సింగపూర్  యూనివర్సిటీ నుంచి ఆమె మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. ఈ మేరకు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆమె పట్టా అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ‘తీన్ మార్’ లో పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా నటించారు. ఈ మూవీ సమయంలో వీళ్ల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అన్నాను 2013లో పవన్ కల్యాణ్ పెళ్లి చేసుకున్నారు.