పోసానిపై దాడికి యత్నించిన పవన్ అభిమనులు

V6 Velugu Posted on Sep 28, 2021

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేశారు జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్. పవన్ కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని .. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో తెలిపారు. అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని పోసానిపై దాడికి యత్నించారు పవన్ అభిమనులు. ఖబడ్దార్  పోసాని అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తితంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tagged Pawan kalyan, fans, Posani Krishna Murali,

Latest Videos

Subscribe Now

More News