ఏపీ క్రిమినల్స్ అడ్డాగా మారిపోయింది.. గూండాలతో గొడవకు దిగుతా

ఏపీ క్రిమినల్స్ అడ్డాగా మారిపోయింది.. గూండాలతో గొడవకు దిగుతా

జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి విజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ వాడీవేడిగా ప్రసంగించారు.
జనసేన అధికారంలోకి వస్తే శాంతి భద్రతల పరిరక్షణకు ఇంపార్టెన్స్​ ఇస్తామని ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఏపీ క్రిమినల్స్​కి అడ్డాగా మారిపోయిందని సీరియస్​ కామెంట్స్​ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శుక్రవారం ( జూన్ 16)  జరిగిన వారాహి యాత్ర సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవి చేపట్టడానికి రెడీగా ఉన్నానని, దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా తనను సీఎం చేయాలన్నారు. ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇక.. గూండాలతో గొడవకోసం రోడ్డుమీదకైనా వస్తానని, తనకు అధికార ఇవ్వాల ప్రజలను కోరారు. జగన్​ వంటి దుర్మార్గపు పాలనకు ఎదురు వెళ్లక తప్పడం లేదన్నారు.

ఇక్కడి దేవతా విగ్రహాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తే పిచ్చోళ్లు చేశారని చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకు అన్ని విగ్రహాలను పిచ్చోళ్లే ధ్వంసం చేశారా? హిందూ వర్గాలకు, ఇతర వర్గాలకు గొడవలు పెట్టించి మళ్లీ ఓట్లు చీల్చి అధికారంలోకి రావాలనే చచ్చు ఆలోచన ఈ ముఖ్యమంత్రిదంటూ వైసీపీని విమర్శించారు

తనకు క్రిమినల్స్ అంటే చిరాకు అని స్పష్టం చేశారు.  పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్.  నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వీళ్లా మనలను పాలించేది..  సిగ్గుండాలి మనకు ఇలాంటి వాళ్లతో పాలింపబడడానికి  అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తానేమీ సినిమా మాటలు మాట్లాడడంలేదని.. సినిమాలు కంటే రియల్ లైఫ్ లోనే ఎక్కువ చేస్తానని, గొడవలు అంటే  తనకేమీ భయం లేదని స్పష్టం చేశారు. తాను తెగించి పోరాడతానని అన్నారు. 

 వైసీపీ నేతలతో జరుగుతున్న చెప్పుల యుద్ధంపై పవన్ వ్యంగ్యాస్త్రం విసిరారు. తన  రెండు చెప్పులు ఎవరో కొట్టేశారంటూ.. . వైసీపీ సర్కారు గుడిలో కూడా నా రెండు చెప్పులు పోయాయి. నా చెప్పులు దొంగిలించింది ఎవరో కనిపిస్తే పట్టుకోండి... నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్ అంటూ పవన్ ఎత్తిపొడిచారు.