
హరిహర వీరమల్లు సినిమా మరో మూడ్రోజుల్లో (జులై 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.250 కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించారు నిర్మాత ఎం. ఎం రత్నం. ఈ క్రమంలో ఆడియన్స్ కు సినిమా మరింత రీచ్ అవ్వడానికి నేడు వీరమల్లు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇందులో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'హరిహర వీరమల్లు సినిమాను అనాథగా వదిలేయలేదు. అండగా ఉన్నానని చెప్పేందుకు వచ్చానని' పవన్ అన్నారు. హరిహర వీరమల్లు సినిమా కోసం నిర్మాత ఎం. ఎం రత్నం పడ్డ కష్టాలను పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆయన మాటల్లోనే.. ' వీరమల్లు చిత్రీకరణలో కరోనా సహా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన నిర్మాత ఎం. ఎం రత్నం సంకల్పం గొప్పది. ఒక నిర్మాత సినిమా తీయాలంటే ఒక యజ్ఞం చేయాలి. ఎంతోమంది చేత తిట్లు తినాలి.. అన్నీ క్రాఫ్ట్స్ గురించి ఆలోచించాలి. సినిమా మొత్తం ముగిశాక చివరికి నిర్మాతకు డబ్బులొస్తాయో రావో కూడా తెలియదు.
ALSO READ : హరిహర వీరమల్లు క్లైమాక్స్ను భుజాల మీదకు తీసుకున్నా
ఇలాంటి పరిస్థితిలో నిర్మాత ఎం. ఎం రత్నంకు అండగా ఉండాలని వచ్చాను. ఈయన పడ్డ కష్టం చెప్పాలని వచ్చాను. నిర్మాత రత్నం ఒక మంచి సినిమా తీశారని చెప్పడానికి వచ్చాను. సినిమా కోసం ఎంతోమంది గొప్ప నటులను తీసుకొచ్చారు. అలాంటి నిర్మాత బాగుండాలని కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నా చిత్రాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియని నేను.. కేవలం ఎం. ఎం రత్నం లాంటి నిర్మాతకు అండగా ఉండాలనే ఈ ప్రెస్ మీట్కు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు.