ఇన్స్టాలోకి ప‌వ‌ర్ స్టార్.. రికార్డ్స్ బ‌ద్ద‌లు అవుతాయా

ఇన్స్టాలోకి ప‌వ‌ర్ స్టార్.. రికార్డ్స్ బ‌ద్ద‌లు అవుతాయా

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) త్వరలో ఇన్స్టాలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు(Nagababu) కన్ఫర్మ్ చేశారు. ఈమేరకు నాగబాబు తన ఇన్స్టాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు "హి ఈజ్ కమింగ్ టూ బ్లాస్ట్" అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే, ఇన్స్టాలో పవన్ ఎంట్రీ ఎప్పుడు అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు నాగబాబు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో బ్రో(Bro), ఓజి()OG, ఉస్తాద్ భగత్(Ustaad bhagathsingh) సింగ్, హరిహర వీరమల్లు(Hari hara veeramallu) సినిమాలు షూటింగ్ దశలలో ఉన్నాయి. ఇక బ్రో సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ తో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌(Sai dharamtej) కూడా నటిస్తున్నారు.