పవన్ తో మేయర్ సెల్పీ..పవర్ ఫుల్ ఫొటో అంటూ కామెంట్స్

పవన్ తో మేయర్ సెల్పీ..పవర్ ఫుల్ ఫొటో అంటూ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు. పవర్ ఫుల్ ఫొటో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇవాళ్టితో రాష్ట్రపతి విడిది ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే రేఖానాయక్‌ తో పాటు కొంతమంది మహిళలు పవన్ తో సెల్ఫీ దిగారు. హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లారు. మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ న హైదరాబాద్ కు వచ్చారు. నాలుగు రోజుల పాటు బిజీగా గడిపారు.