Chiranjeevi: మెగా 158 గ్రాండ్ లాంచ్‌.. అన్నయ్య కోసం వచ్చిన తమ్ముళ్లు.. మాస్ లెవెల్‌లో టైటిల్‌!

Chiranjeevi: మెగా 158 గ్రాండ్ లాంచ్‌.. అన్నయ్య కోసం వచ్చిన తమ్ముళ్లు.. మాస్ లెవెల్‌లో టైటిల్‌!

Mega 158 Launch: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘Mega158’ (వర్కింగ్ టైటిల్). వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు, బాబీ మళ్ళీ వ‌స్తుండ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (మే 21, 2026న) సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా లాంచ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మెగా బ్రదర్స్ ఒకే కారులో కలసి రావడం ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై చిరంజీవి, పవన్, నాగబాబులను చూసే ఛాన్స్ రావడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. స్టైలిష్ లుక్లో దర్శనం ఇచ్చిన పవన్‌, క్లాప్‌ కొట్టి చిత్రాన్ని షురూ చేశారు. చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కెమెరా స్విఛ్‌ ఆన్‌ చేశారు. ఈ ఈవెంట్కి హీరోయిన్‌ అనశ్వర రాజన్‌ కూడా అటెండ్ అవ్వడం క్యూరియాసిటీ పెంచింది. అయితే, ఈ మెగా ప్రాజెక్ట్లో ఆమె చిరుకు కుమార్తెగా కనిపించనున్నట్లు కన్ఫామ్ అయిందనే తెలుస్తోంది. 

చిరంజీవి మాసివ్ లుక్..

మెగా 158 కోసం మెగాస్టార్ చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి అయింది. ఈ సినిమాలో చిరు మరింత ఊరమాస్ అవతార్‌లో కనిపించనున్నారని, ఫైనల్ లుక్ ఇప్పటికే లాక్ చేసినట్లు బాబీ తెలిపారు. “బాస్ మళ్లీ విస్ఫోటనం సృష్టించడానికి సిద్ధం” అన్న స్థాయిలో ఈ లుక్ ఉండబోతోందని అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది

‘కాకాజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌..!

మెగా 158 సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. అక్కడి ట్విస్టులు, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. చిరంజీవి సరసన ప్రియమణి నటించనున్నట్లు, అలాగే డింపుల్ హయతి నెగటివ్ షేడ్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్. .

కాస్టింగ్ విషయానికి వస్తే,

చిరంజీవి సరసన సీనియర్ నటి ప్రియమణిను ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే గ్లామరస్ బ్యూటీ డింపుల్ హయతి ఒక కీలకమైన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. తమన్  సంగీతం అందిస్తున్నారు.

విలన్‌గా బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ నటిస్తున్నట్టు సమాచారం. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్. రూబెన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్.ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా విజువల్‌గా, మాస్ ఎంటర్టైనర్‌గా భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.