
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో వినోదయ సీతం రీమేక్ ఒకటి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను.. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. రీమేక్ అయినప్పటికీ ఇద్దరు మెగా హీరోలు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అందుకే ఈ సినిమా నుండి వస్తున్న చిన్న అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక తాజా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను మే 18న సాయంత్రం 4:14 ని"కు రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్ అంనౌన్స్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మరోసారి దేవుడిగా కనిపించనున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.