అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి: పవన్ కళ్యాణ్

అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓటర్లను అభ్యర్థించారు. ఒక్కసారి తమకు అధికారం ఇచ్చి చూడాలని, ఏపీని దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని కోరారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్యూహమైనా వేస్తానన్నారు. 'పిఠాపురం సాక్షిగా.. దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నా.. నాకు అధికారం ఇవ్వండి. మిమ్మల్ని అర్థిస్తున్నా.. నన్ను సీఎంను చేయండి' అని పవన్ విజ్ఞప్తి చేశారు.

‘‘నా రెండు చెప్పులు కొట్టేశారు.. ఎవరో దొంగిలించారు. మీకు కనిపిస్తే పట్టుకోండి.. నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘నేను మతపిచ్చి ఉన్నవాడిని కాదు. ధర్మం వైపు ఉండే వాడిని. హిందూ దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేశారు ఇక్కడ.  ఎవరు చేశారు ఇది..? ఎవడో గుర్తింపు కోరుకునే వాడు చేశాడా అనుకున్నాను.. కానీ, పిచ్చివాళ్లు చేశారని రాష్ట్రమంతటా అదే కథ అల్లింది ఈ వైసీపీ ప్రభుత్వం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు --- పవన్ కళ్యాణ్.