Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్.. రౌద్ర‌ర‌సాన్ని ఆవిష్క‌రించేలా ‘అసుర హననం’

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్.. రౌద్ర‌ర‌సాన్ని ఆవిష్క‌రించేలా  ‘అసుర హననం’

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో పాట వచ్చేసింది. ‘అసుర హననం’ (Asura Hananam) పేరుతో వచ్చిన ఈ పాట రౌద్ర‌ర‌సాన్ని ఆవిష్క‌రించేలా ఉంది.

ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించేలా సాగింది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను ఐరా ఉడిపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ సంయుక్తంగా పాడారు.

"ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం.. గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం.. నిషిని చీల్చు క్షిద్రుడల్లే ఉద్బవించు ఆయుధం రక్షకైనా, శిక్షకైనా.. చొచ్చుకెళ్లు రణద్వనం" అంటూ రాంబాబు రాసిన ఈ పదాలు పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. కథలో భాగంగా తమ సామ్రాజ్యంలోని ప్రజలను దుష్టశక్తుల్లా శిక్షించే రాజులను అంతమొందించడానికి కదిలిన వీరుడ్ని సూచించేలా ఈ పాట పదాలు విధ్వంసంలా సాగాయి.

ఈ పాట‌ను ఇప్ప‌టికే 50 సార్లు విన్నాన‌ని కీర‌వాణితో పవన్ చెప్పడంతో ఈ పాటపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే యుద్ధాన్ని స్ఫురించేలా కీరవాణి ఇచ్చిన థీమ్ మ్యూజిక్ పవర్ ఫుల్గా ఉంది. 

Also Read : సొగసైన జలకన్యలా జాన్వీ

ఇప్పటికే హరిహర వీరమల్లు నుంచి రిలీజైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఈ మూడో పాట కూడా అంతకుమించి అనేలా ఉండటంతో పవర్ స్టార్ అభిమానుల్లో వీరమల్లుపై క్యూరియాసిటీ పెరిగింది. అసుర హననం లిరిక్ రైటర్ రాంబాబు గోసాల గతంలో మజిలీ, అర్జున్ రెడ్డి, కాంతారా, రూల్స్ రంజాన్ వంటి సినిమాల్లో పలు పాటలకు సాహిత్యం అందించాడు. ఆలస్యం ఎందుకు మీరు కూడా పాట వినేయండి.

క్రిష్ జాగర్లముడి-జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తున్నాడు. పీరియాడిక్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందించారు. ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మొదటిభాగం తెరకెకిక్కించారు. జూన్ 12న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.