పవన్ అభిమానులకు శుభవార్త

పవన్ అభిమానులకు శుభవార్త

సంక్రాంతికి రావాల్సిన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రం, ప్యాన్ ఇండియా మూవీస్‌‌‌‌కి దారి వదులుతూ ఫిబ్రవరికి వెళ్లింది. పవన్ అభిమానులను ఇది కొంత నిరాశ పరిచింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు భారీ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ప్లాన్ చేశాడట పవన్ కళ్యాణ్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌‌‌‌లో రికార్డులు క్రియేట్ చేస్తుండగా మరో పాటను ఈనెల 31న విడుదల చేయబోతున్నారట. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ని  పవన్ కళ్యాణ్ స్వయంగా  పాడినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ పాడిన పాటలకు ఏ స్థాయిలో రెస్పాన్స్‌‌‌‌ వచ్చిందో తెలిసిందే. దీంతో ఈ పాటపై కూడా ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ప‌‌‌‌వ‌‌‌‌న్‌‌‌‌కి జంటగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్‌‌‌‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. మలయాళంలో మెప్పించిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్‌‌‌‌’కి ఇది రీమేక్. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ఈ మూవీని విడుదల చేయనున్నారు.