'అంటే సుందరానికి' ప్రీరిలీజ్... చీఫ్ గెస్ట్ గా పవన్

'అంటే సుందరానికి' ప్రీరిలీజ్... చీఫ్ గెస్ట్ గా పవన్

నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళీ నటి నజ్రియా నజిమ్ నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికి'. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. జూన్‌ 10న తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది. అయితే మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ నెల 9న ప్రీ రిలిజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నాడు. ఈ విషయాన్ని హీరో నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో నాని బ్రాహ్మణ అబ్బాయిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా కనిపించనున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.