విశ్వక్ సేన్ మూవీకి క్లాప్ కొట్టిన పవర్ స్టార్..

విశ్వక్ సేన్ మూవీకి క్లాప్ కొట్టిన పవర్ స్టార్..

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటించడం విశేషం. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఈ చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమానికి నటులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా హాజరైయ్యారు. 

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభంకానుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజ కోన, లిరిసిస్ట్‌గా చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్‌గా బాలమురుగన్ వ్యవహరిస్తున్నారు.