
సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారో సై అంటే సై అన్నారు పవన్. తనకు ప్రయాణం తప్ప గెలుపోటములుండవన్నారు. జగన్ గంజాయిని రాష్ట్ర పంటగా చేసిండని..గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా చేసిండని విమర్శించారు. గాంధీ గారు సత్య సోదన పుస్తకం రాస్తే..జగన్ గారు అసత్య సోదన అని రాస్తారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను జగన్ నాశనం చేసిండన్నారు. జగన్ తన చిన్న వయసులో పోలీసులను కొట్టిండని ఆరోపించారు. పోలీసులను కొట్టిన వ్యక్తి రాష్ట్రాని పాలించడం సిగ్గు చేటన్నారు. పదే పదే తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు ప్రతి చిన్న విషయం తెలుసన్నారు. మంత్రులందరి చిట్టా తాను విప్పగలనని కానీ.. తన సంస్కారం మాట్లాడనివ్వడం లేదన్నారు. వైసీపీ నేతలు నోళ్లకు సైలెన్సర్లు బిగించుకుంటే.. జనసేన సైనికులు బైకులకు సైలెన్సర్లు బిగించుకుంటారన్నారు పవన్. 150 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది నేతలకు సైలెన్సర్లు లేవన్నారు
వైసీపీ నడిపిస్తోన్న ఈ దోపిడి వ్యవస్థకు ఎదురొడ్డి నిలుస్తున్నామన్నారు పవన్. వైసీపీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. యువత ,శ్రామిక రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. యువతకు రెండున్నర లక్షల ఉద్యోగాలేక్కడని ప్రశ్నించారు. జే ట్యాక్స్ అని కొత్తగా పెట్టి.. మత్యకారుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. భీమవరంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవన్నారు. తనను తిట్టడం మీద పెట్టిన శ్రద్ధ భీమవరంలో డంపింగ్ యార్డు మీద పెట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేదం చాలా కష్టమన్నారు పవన్. అధికారంలోకి వస్తే మళ్లీ పాత ధరలకే మద్యం అమ్మకాలు జరిపిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి కల్తీ మద్యం అమ్ముతోందన్నారు.
క్లాస్ వార్ గురించి మాట్లాడే ఈ సీఎంకు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు పవన్. క్లాస్ వార్ అంటే నిస్సాహయుడిని డబ్బున్నోళ్లు దోచుకోవమేనన్నారు. కులం పేరు పెట్టుకునే వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఒక్క కులం అధికారం చేయాలనుకోవడం తప్పున్నారు పవన్. వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఒక్క కులం అధికారం చెలాయించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీలకు సంపూర్ణ రాజ్యాంగ అధికారం దక్కాలన్నారు.