గౌతంరాజ్ మృతి పట్ల పవన్ సంతాపం

 గౌతంరాజ్ మృతి పట్ల  పవన్ సంతాపం

సినీ ఎడిటర్ గౌతంరాజ్ మృతి పట్ల హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  సంతాపం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్న గౌతంరాజ్ కన్నుమూయడం విచారకరమని అన్నారు.  ఎడిటర్ గా వందల సినిమాలకు పనిచేసిన అనుభవశాలి అని కొనియాడారు. తను నటించిన గోకులంతో సీత, సుస్వాగతం, గబ్బర్ సింగ్, గోపాల గోపాల చిత్రాలకు గౌతంరాజ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారని పవన్  ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గౌతంరాజ్ అత్మకు శాంతి చేకూరలని, ఆయన కుటుంబానికి ప్రగాడ  సానుభూతి తెలిపారు పవన్.  కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతంరాజ్  ఇవాళ(బుధవారం) ఉదయం కన్నుమూశారు.  మధ్యాహ్నం 3గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగుతోపాటు తమిళం, మళయాలం, కన్నడ భాషలలో కలుపుకోని 800కు పైగా సినిమాలకు ఎడిటింగ్ వర్క్  చేశారు.