అనిల్ కి ఓకే చెప్పిన పవన్.. ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్

అనిల్ కి ఓకే చెప్పిన పవన్.. ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో డైరెక్టర్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అంటే.. అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వరుసగా మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఓ పక్క పాలిటిక్స్, మరోపక్క సినిమాలు.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు.

అయితే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు పవన్ మరో సినిమాకి కమిట్ అయ్యాడట. అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో. డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా. పక్క ఎంటెర్టైమెంట్ సినిమాలు తెరకెక్కించే అనిల్ రావిపూడి. అవును.. అనిల్ ఈమధ్య దిల్ రాజుకి ఒక లైన్ చెప్పాడట. అది పవన్ కి అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట దిల్ రాజు. వెంటనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని అనిల్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట.

త్వరలొనే ఈ కథని పవన్ కళ్యాణ్ కి వినిపించి ఒకే చేయించే పనిలో ఉన్నాడట దిల్ రాజు. ఈ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే.. చాలారోజుల తరువాత పవన్ ని ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీలో చూడటం మాత్రం పక్కా. అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలయ్య తో ఒక మాస్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవగానే.. పవన్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నాడట అనిల్.