పవన్ మరో రీమేక్.. మళ్ళీ దేవుడిగా?

పవన్ మరో రీమేక్.. మళ్ళీ దేవుడిగా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా రీమేక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రీ ఎంట్రీలో ఇప్పటివరకు పవన్ చేసిన మూడు సినిమాలు రీమేక్సే కావడం విశేషం. అందులో ముందుగా వచ్చిన వకీల్ సాబ్(Vakeel saab) హిందీ పింక్(Pink) రీమేక్ కాగా, భీమ్లా నాయక్(Bheemla nayak) మళయాళ ఆయ్యప్పనుమ్ కోశియుమ్(Ayyappanum Kishiyum) రీమేక్ గా వచ్చింది. ఇక తాజాగా వచ్చిన బ్రో(Bro) సినిమా కూడా తమిళ హిట్ మూవీ వినోదయ సితం(Vinodaya sitam) నుండి రీమేక్ చేసిందే. 

ప్రస్తతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారట. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay kumar) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ ఓ మై గాడ్2(OMG2). 2012లో వచ్చిన ఓ మై గాడ్(OMG) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఆగస్టు 11న ఓ మై గాడ్2 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే  ఓ మై గాడ్ సినిమాను పవన్ కళ్యాణ్, వెంకటేష్(Venkatesh) కాంబోలో గోపాలా గోపాలా(Gopala Gopala) పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ గోపాలునిగా భగవంతుని రూపంలో కనిపంచారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓ మై గాడ్2 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే.. పవన్ కు మరో రీమేక్ రెడీ అయినట్టే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరి ఈ రీమేక్ పట్టాలెక్కితే.. పవన్ మరోసారి దేవుడిగా దర్శనమివ్వనున్నాడు. మరి ఈ సినిమా రీమేక్ చేయడానికి పవన్ ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.