వైసీపీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను కూలుస్తాం: పవన్ కళ్యాణ్

వైసీపీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను కూలుస్తాం: పవన్ కళ్యాణ్

2024 ఎన్నికల్లో గెలిచాకా..వైసీపీ నేతల ఇళ్లను చట్టప్రకారం కూలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మాది రౌడీ సేన కాదని..విప్లవ సేన అని చెప్పారు. వైసీపీ వాళ్లు ఆఖరికి కండ్రాయర్ షాపులు పెడుతామన్న వారిని కూడా పైసలు అడుగుతున్నారన్నారు. ఇప్పటంలో ఇండ్లు కూల్చి.. తన గుండల్లో గునపం గుచ్చారన్నారు. వైసీపీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను కూలుస్తామన్నరు. ప్రధానితో ఏం మాట్లాడానో..సజ్జలకు చెప్పాలంటున్నారన్నారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటం బాధితులకు లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేశారు. ఇప్పటంలో గ్రామస్థుల గడపలు కూల్చడాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై కొట్టినట్లే అనిపించిందన్నారు. 

ఎవరికి అన్యాయం చేసినా స్పందిస్తా...

వైసీపీ రాజకీయ పార్టీనా..ఉగ్రవాద సంస్థా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేనకు ఎవరూ అండగా ఉండకూడదా అన్నారు. రాజకీయం వైసీపీయే చేయాలా...తాము చేయకూడదా అని ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని..జనసేనకు ఓట్లు వేసినా..వేయకపోయినా అండగా ఉంటామన్నారు. యువత కోసం ఆలోచించే నేతలు పాలకులుగా రావాలని ఆకాంక్షించారు. దేశం, రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థే లక్ష్యమని.. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దానికోసం పోరాడతానన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడనని చెప్పారు. 

నా మీద పడి ఏడుస్తారేంటి..?

2014 తర్వాత ప్రధాని మోడీని తాను పలు సందర్భాల్లో కలిశానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తానెప్పుడు మోడీతో మాట్లాడినా దేశభద్రతతో పాటు..ప్రజల రక్షణే టానన్నారు. వైసీపీ లా తాను..ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పనని ఎద్దేవా చేశారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే తానే కొడతానని.. ప్రధానికి ఎందుకు చెప్తానన్నారు. ఆంధ్రాలో పుట్టిన తాను..ఆంధ్రలోనే యుద్ధం చేస్తానని..ఢిల్లీకి వెళ్లి ఎందుకు చేస్తానని చెప్పుకొచ్చారు. తాను అధికారం లేనోడిని..అయినా వైసీపీ నేతలు..తన మీద పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.