ఎర్రచందనం నరికేస్తే తాట తీస్తాం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఎర్రచందనం నరికేస్తే తాట తీస్తాం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
  • ఎర్రచందనం..వెంకటేశ్వరస్వామి రక్తం నుంచి పుట్టిన చెట్టు: పవన్​ కళ్యాణ్​

ఎర్రచందనం చెట్ల పుట్టుకపై ఏపీ డిప్యూటీ సీఎం  పవన్​ కళ్యాణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రచెందనం చెట్లు  వెంకటేశ్వరస్వామి గాయం రక్తం నుంచి పుట్టిన చెట్టు.. దానిని నరికివేయొద్దు.. అక్రమంగా విక్రయించొద్దు అన్నారు. శనివారం (నవంబర్​ 8)  ఎర్రచందనం స్మగ్లింగ్​పై మీడియా తో మాట్లాడిన పవన్​ కళ్యాణ్​.. గత ప్రభుత్వం హయాంలో భారీగా ఎర్ర చందన స్మగ్లింగ్​ జరిగిందన్నారు. ఆ సమయంలో దాదాపు 2.65 లక్సల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అదికారులు పట్టుకున్నారు.. అంటే దాదాపు లక్షా 30వేల  చెట్లను నరికివేశారు.. వీటి విలువ ఐదు వేల కోట్లు ఉంటుందని అన్నారు. ఇక పట్టుకున్నదే ఇంత అయితే.. దొరక్కకుండా స్మగ్లింగ్​   చేసింది ఇంతకు రెట్టింపు ఉండొచ్చని అంచనా వేశారు.. 2019–2024 మధ్య కాలంలో దదాపు 8నుంచి 10 వేల కోట్ల ఎర్ర చందనం స్మగ్లింగ్​ జరిగిందని ఆరోపించారు  ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్.

రాష్ట్రంలో ఎవరి ఊహకు అందనంత సొత్తు ఎర్ర చందనం స్మగ్లింగ్​ తో దోచుకున్నారు. శేషాచల అడవిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు కనుమరుగవుతున్నాయని అన్నారు వపన్​ కళ్యాణ్​. ఎర్రచందనం విషయంలో మనకు ఇతర రాష్ట్రాలకు మధ్య సమన్వయంతో పనిచేస్తామన్నారు. 

అన్ని రాష్ట్రాలతో సమన్వయం ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్​ కు చెక్​ పెడతామన్నారు పవన్​. ఉమ్మడి కడప జిల్లాలో మూడు జోన్లలో విపరీతంగా స్మగ్లింగ్​ జరుగుతుందన్నారు.  ఎర్రచందనం స్మగ్లింగ్  కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్ లను గుర్తించాం.. వారిని త్వరలో పట్టుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ అన్నారు. 

ఎవరూ ఎర్రచందనం స్మగ్లింగ్​ వృత్తిలోకి వెళ్లొద్దు.. ఏపీ, తమళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నాను.. ఎర్రచందనం స్మగ్లింగ్​ పాల్పడితే తాట తీస్తామని స్మగ్లర్లకు పవన్​ కళ్యాణ్​వార్నింగ్​ ఇచ్చారు. మహారాష్ట్ర నిర్వహించిన ఆపరేషన్ కగర్ మాదిరిగానే ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని  పవన్​ కళ్యాణ్​ హెచ్చరించారు. ఎర్ర చందనం చెట్లు కొట్టాలంటేనే భయపడే స్థితికి తీసుకువస్తామన్నారు పవన్. ఒక చెట్టు కొడితే చరిత్రలో యుద్ధాలు జరిగాయి.. ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవుల ద్వారా ఎర్రచందనం తరలిపోయే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ చెప్పారు.