పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..500 మంది ఫైటర్స్‌‌‌‌‌‌‌‌ తో పవర్ స్టార్

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..500 మంది ఫైటర్స్‌‌‌‌‌‌‌‌ తో పవర్ స్టార్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్..హీరోగానూ బిజీ అవనున్నారు.ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు’. పీరియాడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. పాలిటిక్స్ కారణంగా కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్రేక్ పడింది.

తాజాగా ‘హరి హర వీరమల్లు’ మూవీ టీమ్ ఓ క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి  కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి స్టార్ట్ చేసినట్టు, ఫైట్ మాస్టర్  స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణను ప్రారంభించినట్టు తెలియజేశారు.ఈ యాక్షన్ సీక్వెన్సులో సుమారు ఐదొందల మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లోనే సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అవుతారని టీమ్ చెప్పింది. డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని కొంత భాగం రూపొందించగా, ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు.

రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏ దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి  సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కన్నడ, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాళ, హిందీ భాష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో సినిమా విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నున్నారు.