పవర్ స్టార్ స్టామినా : ఒక్క పోస్టు పెట్టలేదు.. వన్ మిలియన్ ఫాలోవర్స్

పవర్ స్టార్ స్టామినా : ఒక్క పోస్టు పెట్టలేదు.. వన్ మిలియన్ ఫాలోవర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) తాజాగా ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే.. దాదాపు 8.05 లక్షల మంది ఫాలో అవడం మొదలుపెట్టారు. నిమిష.. నిమిషానికి ఈ కౌంట్ పెరుగుతూనే ఉంది. ఇది చూసిన ఫ్యాన్స్.. పవన్ రాకతో ఇన్స్టా షేక్ అయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

"ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో.. జై హింద్" అనే లైన్స్ ను తన బయోలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే.. ఈ ఇన్స్టా ఆకౌంట్ లో పవన్ కేవలం రాజకీయాలకు సంబంధించిన పోస్టులు పెడతారా? లేక సినిమాలకు సంబంధించిన పోస్టులు కూడా పెడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "బ్రో(Bro)" అనే సినిమా చేస్తున్నారు. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కీ రోల్ లో కనిపిస్తున్న ఈ సినిమాను.. తమిళ డైరెక్టర్ సముద్రఖని(Samutirakani) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.