
ఇటీవల ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఫోకస్ పెట్టారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంత పార్ట్ షూట్ పూర్తయింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసి నాన్‌స్టాప్‌గా షూట్‌లో పాల్గొనేలా పవన్ ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా తన పార్ట్‌ను పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
దీంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో ఉండేలా హరీష్ శంకర్ భావిస్తున్నాడట. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు సుజీత్ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని కూడా పవన్ ఈ ఏడాదే పూర్తి చేయాలనుకుంటున్నారట.