వారాహి యాత్రకు డేట్ ఫిక్స్..  

వారాహి యాత్రకు డేట్ ఫిక్స్..  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి వారాహిలో పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అన్నవరంలో పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కల్యాణ్ వారాహిలో బయల్దేరతారని ఆయన పేర్కొన్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వివిధ వర్గాలతో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారాహి యాత్రపై చర్చించారు.  క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాలను కలుస్తారని.. ప్రతి రోజూ ఓ ఫీల్డ్ విజిట్ ఉంటుందంటూ నాదెండ్ల మనోహర్‌ సమావేశంలో తెలిపారు. ఈ ప్రకటనతో జనసైనికుల్లో జోష్ వచ్చేసింది.

వారాహి రూట్ మ్యాప్ విడుదల 

పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహిలో తొలి విడత యాత్ర చేపట్టనున్నారు.  ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, అధిక సమయం ప్రజల మధ్య గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.