డైమండ్ రాణి రోజా , మూడు ముక్కల సీఎం, సంబరాల రాంబాబూ :పవన్

డైమండ్ రాణి రోజా , మూడు ముక్కల సీఎం, సంబరాల రాంబాబూ :పవన్

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన ‘జనసేన యువశక్తి’ సభలో పవన్‌ కల్యాణ్ అధికార పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించిన పవన్.. వైఎస్ఆర్ సీపీ లీడర్లపై డైలాగ్స్ వార్ పేల్చారు. పార్టీ శ్రేణుల హుషారు, సంతోషాన్ని చూసి ‘ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ’ పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ముందుగా వివరించారు. ఆ తర్వాత అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఆద్యంతం ఉత్తేజం, ఉత్సాహం నింపారు.  

మూడు ముక్కల సీఎం 

పవన్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా మండిపడ్డారు. ‘మూడు ముక్కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నేను మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొన్నాను. పంచలు ఊడదీసి కొడతాను అన్న వాడిని. ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్న. సీఎంకు గ్యాంబ్లింగ్‌ పిచ్చి అని ఈ మధ్యే తెలిసింది. ఖైదీ నంబర్‌ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా..? ’ అని వ్యాఖ్యానించారు. రాజు సరైనోడు కాకపోతే సగం రాజ్యం నాశనమవుతుందని, సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనమవుతుందని తనదైన స్టైల్లో ఆరోపించారు పవన్. 

సంబరాల రాంబాబూ పిచ్చికూతలాపు

‘డబ్బు నాకేమీ ఆనందం ఇవ్వలేదు. మాట్లాడితే ప్యాకేజీ ప్యాకేజీ అంటున్నారు. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడుతా. మీరు ఇలాగే మాట్లాడితే చెప్పు తీసుకుని కొడుతా అని చెప్పాను కదా. రణస్థలం నుంచి ఇంకోసారి చెబుతున్న. బొబ్బిలి రాజు కొట్టుకున్న స్థలం ఇది. రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకు  చెబుతున్నా. నా ఎదురుగా వచ్చి.. నా చేతికి అందుబాటులోకి వచ్చి.. నీవు ప్యాకేజీ అను. అప్పుడు నేను ఏం చేస్తానో చెబుతా నీకు. మా జన సైనికుడి చెప్పు తీసుకుని కొడుతా. మా వీర మహిళ చెప్పు తీసుకుని కొడుతా. ఆలోచించుకోండి. ఈ జైళ్లు, పోలీసు కేసులు నాకేం పని చేయవు. ఇక సంబరాల రాంబాబూ ఉంటాడు ఒకడు. ఏమాయ్య సంబరాల రాంబాబూ.. చాలా తెలివిగా ముదురుగా సర్వస్వం తెలిసిపోయినట్లు ముదురు ముఖం వేసుకుని పవన్ కల్యాణ్... అని మాట్లాడుతావు. ఈ పిచ్చికూతలు ఆపేసి పని చూడండి. నేను చెప్పానుగా. నేను యుద్ధం చేస్తానంటే చేస్తాను. సరదాగా చేయను. మాటలు చెప్పను. నేను బతికి ఉన్నంతవరకూ మీతో యుద్ధం చేస్తా. పారిపోను’ అని పవన్ మాట్లాడారు. 

డైమండ్ రాణి రోజా 

తాను రెండు చోట్ల ఓడిపోయానంటూ డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడుతున్నారు. వాళ్లు కూడా యూత్. నీవ్వు కూడానా..? ఛీ నా బతుకు చెడ..! ఇదంతా మీకోసమే. నా కోసం లేదు. మీ కోసం డైమండ్ రాణిచే తిట్టించుకుంటున్న. ఇక సంబరాల రాంబాబు గురించి మీకు తెలిసిందే’ అంటూ సెటైర్లు వేశారు. 

నేను కుల నాయకుడిని కాదురా సన్నాసుల్లారా..

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పైనా పవన్ కల్యాణ్ మండిపడ్డారు. నేను కుల నాయకుడిని కాదురా సన్నాసుల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సినిమాల్లో ఉంటే ఇప్పుడు తిడుతున్న వాళ్లే తనతో సెల్ఫీలు దిగేవాళ్లే అంటూ సెటైర్ వేశారు. ‘నేను ఇవాళ ప్రతి వెదవ, సన్యాసి చేత మాటలు అనిపించుకుంటే నిజంగా నాకు బాధ లేదు. ఇలాంటి వెదవలచే మాటలు అనిపించుకోకుండా బతికేయగలను. పాలిటిక్స్ లో రాకపోతే ఇలాంటి వాళ్లు నాతో ఫొటోలు కూడా దిగుతారు. మీ పక్షాన నిలబడి తిట్టించుకోవడం నేను విజయంగానే భావిస్తాను’ అని అన్నారు.