అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మాజీ స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో కలసి ఆయన అమిత్ షాను కలిశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఈ విషయంపై కూడా ఆయనతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ అమిత్ షాతో పాటు.. ఏపీలో బీజేపీ తో పొత్తుపై కీలక అంశాలు చర్చించేందుకు పలువురు ముఖ్య బీజేపీ నేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి ఇస్తాం

ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గా గెలిచాడు

అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

షర్మిల..జగన్ అన్న వదిలిన బాణం కాదు,కేసీఆర్ వదిలిన బాణం

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు