
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి సారిగా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎన్నికలు జరిగిన విధానం, పోలింగ్ సరళి, నేతల పనితీరు, పార్టీ గెలుపు అవకాశాలు, భవిషత్ కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. గుంటూరులోని మంగళగిరిలో ఈ సమావేశం జరుగుతుంది. విడతల వారీగా పార్టీ నేతలతో సమీక్ష జరుపుతున్నారు. మొదటి విడతలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 140 స్థానాల్లో పోటీచేసింది. మిగతా స్థానాల్లో మిత్రపక్షాలు అయిన సీపీఐ,సీపీఎం,బీఎస్పీ పోటీ చేశాయి.