ఓజీ లెక్కలు మారుతున్నాయి.. రికార్డ్ రేటుకు ఓవర్సీస్ రైట్స్

ఓజీ లెక్కలు మారుతున్నాయి.. రికార్డ్ రేటుకు ఓవర్సీస్ రైట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో  పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్(Gand star) లా కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలనున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా రిలీజైన ఓజీ గ్లింప్స్(OG Glimpse) కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందెన్నడూ కనిపించని కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓజీ గ్లింప్స్ కూడా మోస్ట్ పవర్ ఫుల్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓజీ గ్లింప్స్ కు ముందు ఒకలెక్క.. గ్లింప్స్ తరువాత ఒకలెక్క అనే రేంజ్ లో మారిపోయింది పరిస్థితి. అంతేకాదు ఈ ఒక్క గ్లింప్స్ ఓజీ సినిమా లెక్కలను మొత్తం మార్చేసింది. 

తాజాగా సమాచారం ప్రకారం.. ఓజీ ఓవర్ సీస్ రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయట. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కోట్ చేయగా.. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ రూ.13 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. పవన్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ అవడం విశేషం. ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడానికి మొన్న రిలీజైన గ్లింప్స్ కారణమని టాక్. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ బిజినెస్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.