పవన్ OG నుండి క్రేజీ అప్డేట్.. ఈసారి పవన్,ప్రియాంక

పవన్ OG నుండి క్రేజీ అప్డేట్.. ఈసారి పవన్,ప్రియాంక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ "ఓజి". సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రీసెంట్ గా బాంబేలో స్టార్ట్ అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు మేకర్స్. గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలారోజుల తరువాత పవన్ చేస్తున్న డైరెక్ట్ మూవీ ఇదే. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ప్రస్తుతం పవన్ చేస్తున్న ఏ మూవీకి లేని క్రేజ్ ఓజి మూవీకి ఏర్పడింది. అందుకే.. ఈ సినిమాకి సంబంధించిన చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. షూటింగ్ మొదలైన రోజు విడుదల చేసిన వీడియోకి, సెట్స్ నుండి లీకైన పవన్ ఫోటోస్ కి ఫాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. సినిమా పై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ఇక వీడియోలో మూవీ ఎలా ఉండబోతుందనే హింట్ కూడా ఇచ్చాడు సుజిత్.

తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్  హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో పవన్, హీరోయిన్ ప్రియాంకలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు సుజిత్. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి  థమన్ సంగీతం అందిస్తున్నాడు. రోజురోజుకీ అంచనాలు పెంచేస్తున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.