
మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ పార్టీ నేత నాదేళ్ల మనోహర్ తో కలిసి మేకపాటి పార్థివదేహానికి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా వాసిగా తనకు మేకపాటి కుటుంబం బాగా తెలుసన్నారు. వ్యాపారంలో సంపాదించి ప్రజల కోసం ఖర్చుచేశారని తెలిపారు. మేకపాటి మృతికి సంతాపంగా.. తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశామన్నారు పవన్. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారని.. అలాంటి అరుదైన వ్యక్తి చనిపోవడం జీర్ణించుకోలేనిదన్నారు పవన్.
మరిన్ని వార్తల కోసం