నల్గొండకు పవన్.. మెట్టుగూడ వద్ద ఫ్యాన్స్ ఘనస్వాగతం..

నల్గొండకు పవన్.. మెట్టుగూడ వద్ద ఫ్యాన్స్ ఘనస్వాగతం..

ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మెట్టుగూడ వద్ద అభిమానులు,పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మెట్టుగూడ చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సి ఉన్న పవన్..అభిమానుల తాకిడికి నివాళులు అర్పించకుండానే వెళ్లిపోయారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ..విద్యార్థులు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా 10శాతం గిరిజన రిజర్వేషన్ల కోసం జనసేన పోరాటం చేస్తుందన్నారు.


 
కాగా ఇటీవలె రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పవన్ పరామార్శించనున్నారు. లక్కారం గ్రామానికి చెందిన కొంగర సైదులు, కోదాడకు చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాలను పవన్ పరామార్శించి 5లక్షల బీమా చెక్కులను అందజేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం

ప్రాంతీయం కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోన్న ఓటీటీ

లాలూ ప్రసాద్ యాదవ్ పై మరో కేసు