ప్రాంతీయం కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోన్న ఓటీటీ

ప్రాంతీయం కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోన్న ఓటీటీ

ప్రపంచాన్ని కరోనా కాటేసినప్పుడు జనానికి ఎంటర్ టైన్మెంట్ ను అందించింది ఓటీటీ. లాకడౌన్ లో అంతా నిర్మానుష్యమైనా ఓటీటీ మాత్రం కళకళలాడింది. కోవిడ్ పెంచిన దిగులును డిజిటల్ ప్లాట్ ఫామ్ మెల్లమెల్లగా తుడిచేసి వినోదం పంచింది. ఇంటింట వినోదాల దీపాలను వెలిగించింది. యుద్ధాలు దేశాల సరిహద్దులను ఏర్పాటు చేస్తే కళలు వాటిని చెరిపేసి మానవ సంబంధాలను పటిష్ఠం చేస్తాయి. వాటిల్లో సినిమా ముందుంటుంది. ప్రస్తుతం ఓటీటీ ఆ కార్యక్రమాన్ని బృహత్తరంగా నిర్వహిస్తోంది.

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. ఏది కావాలన్నా ఫోన్ లోనే దొరికేస్తుంది. గతంలో థియేటర్ వెళ్లి సినిమాలు చూస్తే..ఇప్పుడు ఫోనే థియేటర్ గా మారింది. ఏది కావాలన్న ఫోన్ లోనే చూడొచ్చు. దానికి కారణం ఓటీటీ, ఓవర్ ది టాప్. అవును ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. ఇప్పుడు లాంగ్వేజ్ తో పనిలేదు. భాష అర్థంకాకపోయినా ఓటీటీలల్లో సినిమాలు, సిరీస్ లు చూసేస్తున్నారు జనాలు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని కథలను ఆడియన్స్ ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో ఇతర భాషల్లోని కంటెంట్ వాడకం ఎక్కువైంది. 

దాదాపులో 13 ఏళ్ల క్రితం..అంటే 2008లో మనదేశంలో ఓటీటీ సేవలు స్టార్ట్ అయ్యాయి. రిలయన్స్ కు చెందిన బిగ్ ఫ్లిక్స్ ను దేశంలో తొలి ఓటీటీగా పేర్కొంటారు కానీ అది ప్రేక్షకులకు అంతగా చేరువకాలేకపోయింది. 2010 డేటా చౌకగా మారింది. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దాంతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి ప్లాట్ ఫామ్స్ యాప్స్ ను విడుదల చేశాయి.  అయినా జనం మాత్రం వాటికి దూరంగానే ఉండిపోయారు. కానీ కోవిడ్ మొత్తం మార్చేంది. ఓటీటీ యుగాన్ని మరింత దగ్గర చేసింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీప్లస్ హాట్ స్టార్, ఆహా లాంటి ఓటీటీ యాప్ లకు ఇప్పుడు మస్త్ డిమాండ్ ఉంది. యూజర్స్ ను ఆకట్టుకోవటానికి ఈ డిజిటల్ ప్లాట్ ఫాంలు మంచి కంటెంట్ తో పాటు సబ్ స్క్రిప్షన్ లలో డిస్కౌంట్లు పెడుతున్నాయి. దీనివల్ల చాలా మంది ఓటీటీలకు అట్రాక్ట్ అవుతున్నారు. 

ఓటీటీని దగ్గర చేసిన లాక్ డౌన్

లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న చాలా మంది ఓటీటీకి అలవాటు పడ్డారు. బయటకు వెళ్లలేని పరిస్థితి రావడం, అప్పుడుప్పడే ఓటీటీలు పుట్టుకొస్తుండటం వల్ల జనాలు బాగా చూసేశారు. తమిళ, మలయాళం, కన్నడ తో పాటు, హిందీ ఇంగ్లీష్ , కొరియన్ భాషల్లోని కంటెంట్ ను కూడా ప్రేక్షకులు అస్వాదిస్తున్నారు. దీనివల్ల లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ బూమ్ మూడు, నాలుగేళ్ల ముందే వచ్చేసింది. ఓటీటీలతో వినోదరంగంలో ఉత్పత్తి కూడా పెరిగింది. సృజనాత్మకత పరిధి విస్తృతమైంది.  ప్రాంతీయ భాషా చిత్రాలే కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోంది ఓటీటీ. 

ఈ మార్పు గురుంచి ప్రముఖ సినీ విశ్లేషకుడు దీపక్ కోడెల మాట్లాడుతూఓటీటీ వచ్చిన తరువాత రీజనల్ సినిమా రేంజ్ పెరిగింది. ఏ భాషలో సినిమా బాగుంటే ప్రేక్షకులు అది చూసేస్తున్నారు. లాంగ్వెజ్ అనేది లేదిప్పుడు. దీనివల్ల లాభం ఏంటంటే చిన్న సినిమాకు గుర్తింపు వస్తుంది. స్టార్ వాల్యూ లేకపోయినా జనాలకు రీచ్ అవుతుంది. ఒకప్పుడు మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి తప్ప ఎవరు పెద్దగా మనకు తెలియదు. కానీ ఇప్పుడు నివిన్ పాలి, ఫహద్ ఫాజిల్ నుండి షానే నిగమ్ లాంటి యంగ్ హీరోలకు మార్కెట్ పెరిగింది. వాళ్లని ఇప్పుడు మన తెలుగు సినిమాలో కూడా పెట్టుకుంటున్నారు. తద్వారా నేషనల్ వైడ్ రీచ్ ఉంటుందని అంటున్నారు దీపక్ కోడెల.

ఈ రీజనల్ సినిమా స్పాన్ పెరగడం వల్ల ప్రొడ్యూసర్లకు కూడా లాభం ఉంటుందన్నారు. ఇంతకు ముందు పెద్ద సినిమాలకే ఇతర భాషల్లో రీచ్ ఉండేది కానీ ఇప్పుడు చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే మర్కెట్ పెరుగుతుంది అంటున్నారు దీపక్. మాలీవుడ్, కోలీవుడ్ లలో చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వస్తున్నాయి. అందుకే ఎక్కువగా ఆ సినిమాలు చూస్తున్నారు. కారణం వాళ్ల కథలు నెటివిటీకి దగ్గరగా ఉంటున్నాయి. మన దగ్గర ఇప్పుడిప్పుడే కేరాఫ్ కంచెరపాలెం, మిడిల్ క్లాస్ మెలోడిస్ , పలాస లాంటి కథలు వస్తున్నాయని చెప్పారు. 

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే చేస్తున్నారు మన మేకర్స్. అందుకే వేరే ఇండస్ట్రీలకు వచ్చినంత పేరు మనకు రావట్లేదు. మన దర్శక నిర్మాతలు మలయాళం రీమేక్ లు చేయడం తగ్గించి మన మట్టికథలను చెప్తే తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరుగుతుందని దీపక కోడెల అన్నారు. సినిమాల్లో కొత్తదనం కోరుకునే వాళ్లు ఎక్కువై..రొటీన్ కథలు, కమర్షియల్ సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందులో భాగంగానే ఇతర భాషల చిత్రాలను చూస్తున్నారు. ఈ ప్రాంతీయ భాషా చిత్రాల హద్దులు చెరిగిపోవడం వల్ల మీడియం రేంజ్ ఆర్టిస్టులకు, టాలెంట్ ఉన్న చిన్న ఆర్టిస్టులు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇది మంచి పరిణామమని అన్నారు దీపక్ కోడెల.

కాగా ఓటీటీ వచ్చి ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో పెనుమార్పే తెచ్చింది. ప్రేక్షకుడి అభిరుచినే మర్చేసింది. మంచి కంటెంట్ ని ఈజీగా అందించడం వల్ల ప్రేక్షకుడు అట్రాక్ట్ అవుతున్నాడు. ఇతర భాషా సినిమాలే కాకుండా హాలీవుడ్, కొరియన్ సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. రూరల్ ఏరియా లో ఉండే ప్రేక్షకుడు కూడా వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. దీనికంతంటికీ ఓటీటీ రంగంతో పాటు మారుతున్న ప్రేక్షకుడి అభిరుచే.  తెలుగులో ఇప్పుడిప్పుడే కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. ముందు ముందు అవి ఇంకా రావాలి. కమర్షియల్ సినిమాలే కాకుండా పెద్ద హీరోలు, దర్శకనిర్మాతలు డిఫరెంట్ కాన్సెప్టులు, నెటివిటికి దగ్గరగా ఉన్న కథలపై దృష్టి పెడితే ఇంకా మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి.

మరిన్ని వార్తల కోసం

తొలి 5జీ కాల్ చేసిన కేంద్ర మంత్రి

ఎబిసిడిలు చెప్పి రికార్డ్‌‌ కొట్టింది