తొలి 5జీ కాల్ చేసిన కేంద్ర మంత్రి

తొలి 5జీ కాల్ చేసిన కేంద్ర మంత్రి

ఐఐటీ మద్రాసు వద్ద ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక 5జీ నెట్ వర్క్ పై ఆడియో, ఆడియో కాల్ ను కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విజయవంతంగా ప్రయోగించారు. దీనికి సంబంధించిన నెట్ వర్క్ అంతా కూడా దేశీయంగానే అభివృద్ధి చేయబడిందని వ్యాఖ్యానించారు. 

"ఇది గౌరవనీయులైన ప్రధానమంత్రి దార్శనికతకు సాక్షాత్కారమని, స్వంతంగా 4G, 5G టెక్నాలజీని భారతదేశంలో అభివృద్ధి చేయడం, దాన్ని ప్రపంచం కోసం తయారు చేయడంపైనే ఆయన దృష్టి పెట్టారని వైష్ణవ్ అన్నారు. ఈ టెక్నాలజీ స్టాక్‌తో మనం ప్రపంచాన్ని గెలవాలని చెప్పారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రతిపాదనను వచ్చే వారం తుది ఆమోదం కోసం టెలికమ్యూనికేషన్స్ విభాగం కేంద్ర మంత్రివర్గానికి తరలించే అవకాశం ఉందని, 5జీ సేవలను మరింత అభివృద్ధి చేసిన, మెరుగైన సేవలను ఈ ఏడాది ఆఖరు వరకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు.