పవన్ కళ్యాణ్ సంపాదన ఏడాదికి రూ.1500 కోట్లు?

పవన్ కళ్యాణ్ సంపాదన ఏడాదికి రూ.1500 కోట్లు?

హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్టామినా, తన గ్రేస్ మిగతా స్టార్ హీరోల కంటే డిఫరెంట్. తన లుక్స్ తో, మేనరిజం తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తన వర్సటిలిటీని చాటుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్, పాపులారిటీ ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు.

తాజా సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఇటీవల ఏలూరులో పార్టీ నేతలు, మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ తన స్టార్‌డమ్ గురించి చెప్పుకున్నారు. 

'దేశంలోని పెద్ద నటుల్లో నేనూ ఒకడిని. ఇతర అగ్ర హీరోలతో పోటీపడని సాధారణ హీరోగా నేను ఏడాదికి దాదాపు 200 రోజులు పనిచేసి దాదాపు 400 కోట్లు సంపాదిస్తున్నాను. కానీ నేను పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, నేను కూడా సులభంగా 1000-1500 కోట్లు సంపాదించగలను, అది నా సామర్థ్యం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల నాకు ఎక్కువ ఆసక్తి ఉంది' అంటూ .. 

సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న OG మూవీ కోసం, పవన్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ బ్రో మూవీ జూలై 28న రిలీజ్ కానుంది. పవన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే, వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు.