జగన్ దేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎం: పవన్ కళ్యాణ్

జగన్ దేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎం: పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఏపీ అంటూ సెటైర్లు వేశారు.  అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న  ధనిక సీఎం.. కామ్రేడ్ చారు మజందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య వంటి వాళ్ల గురించి మాట్లాడుతున్నారని.. వాటే ఐరనీ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో వర్గాలకు తావు లేదని.. ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలయ్యారని విమర్శించారు. ప్రజల శ్రమ, గౌరవం, జీవితాలు కొంతమందికి అమ్ముడుపోయాయని ఆరోపించారు. వైసీపీ వారిని ట్యాక్స్ పేయర్ గానే చూస్తుందన్నారు.

భూమి నుండి ఇసుక వరకు, మద్యం నుండి గనుల వరకు, అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందనం వరకు ఏపీ నుండి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్నారు.  ప్రభుత్వం ఏపీకి  పెట్టుబడులు తెస్తున్నప్పుడు ఇంకా దావోస్ ఎవరికి కావాలని ప్రశ్నించారు.  ఇక మన ఐటీ మినిస్టర్ న్యూడుల్స్ సెంటర్, ఛాయ్ సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నారని.. ఇది వైసీపీ మాస్టర్ క్లాస్ అంటూ  విమర్శలు చేశారు.