కేసీఆర్ పాలనపై హైదరాబాద్‌‌‌‌లో మాట్లాడుతా

కేసీఆర్ పాలనపై హైదరాబాద్‌‌‌‌లో మాట్లాడుతా

పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంది

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ పాలనపై హైదరాబాద్ లో మాట్లాడుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. షర్మిల కొత్త పార్టీపై స్పందిస్తూ.. ‘ఇంకా ఆమె పార్టీ ఫాం చేయలేదు. ఆ పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడితే బాగుంటుంది. పార్టీ పెట్టే హక్కు అందరికీ ఉంది. కొత్త వాళ్లు రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటాను’ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డి, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ను కలిసినట్టు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మళ్లీ ఆలోచించాలని విజ్ఞప్తి చేశామన్నారు. జగన్ సర్కారు తలచుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకోవచ్చని,  కానీ, ఆ ప్రయత్నం చేయడం లేదని చెప్పారు.  స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నుంచి సానుకూల సమాచారం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో రాజకీయాలు, శాంతి భద్రత పరిస్థితులు, ఆలయాలపై దాడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అమిత్ షాతో చర్చించినట్టు తెలిపారు. తిరుపతి వేదికగా వచ్చే నెల 3, 4వ తేదీలలో బీజేపీ–జనసేన ఉమ్మడి కార్యాచరణ, తిరుపతి ఉప ఎన్నికలపై షాతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

For More News..

కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు

నేడే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక