పవన్‌ ప్రచారానికి వెహికిల్ రెడీ

పవన్‌ ప్రచారానికి వెహికిల్ రెడీ

ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న యాత్రకు స్పెషల్ వెహికిల్ రెడీ అయ్యింది. ఈ వాహనం వీడియోను పవన్ తన  ట్విట్టర్లో పోస్ట్ చేశారు . 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అంటూ ప్రకటించారు. హైదరాబాద్ లో పవన్ వెహికిల్, ట్రయల్ రన్ ను పరిశీలించారు . వాహనానికి సంబంధించి పార్టీ నేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ముఖ్య సూచనలు చేశారు. వెహికిల్ రెడీ చేస్తున్న టెక్నికల్ టీమ్ తోనూ పవన్ మాట్లాడారు. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. 

వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు... వారాహి. ఇదే పేరును వాహనానికి పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాల్లో ఉంది. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారని జనసేన లీడర్లు చెప్తున్నారు. ఆ ఆలోచనతోనే వాహనానికి వారాహి అని పేరు పెట్టినట్టు జనసేన పార్టీ ప్రకటించింది.