UstaadBhagatSingh: విజిల్స్ వేయించే డైలాగ్స్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ డబ్బింగ్ కోసం కౌంట్‌డౌన్

UstaadBhagatSingh: విజిల్స్ వేయించే డైలాగ్స్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ డబ్బింగ్ కోసం కౌంట్‌డౌన్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌’.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ వర్క్ జరుగుతోంది. మంగళవారం నుంచి డబ్బింగ్ పనులను ప్రారంభించినట్టు మేకర్స్ తెలియజేశారు.  పవన్ కళ్యాణ్ త్వరలోనే తన పోర్షన్ డబ్బింగ్‌‌‌‌‌‌‌‌ చెప్పనున్నారు.

ఇందులో ఆయన ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో తనదైన మార్క్ గ్రేస్‌‌‌‌‌‌‌‌తో పవన్ డబ్బింగ్ చెప్పనున్నారని ఇది ఆయన ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌లో మరింత జోష్‌‌‌‌‌‌‌‌ని నింపుతుందని తెలిపారు.

అలాగే  ప్రేక్షకుల చేత ఈలలు వేయించేలా హరీష్ శంకర్ డైలాగ్స్ రాశారని నిర్మాతలు అన్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  ‘గబ్బర్ సింగ్’ తర్వాత  పవన్ కళ్యాణ్, హరీష్  కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు నెలకొన్నాయి.