ఏపీలో ఎప్పటికైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్ కల్యాణ్

ఏపీలో ఎప్పటికైనా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తాం : పవన్ కల్యాణ్

సగటు మనిషికి మేలు చేయాలనే తపనతోనే తాను పార్టీ పెట్టానని  జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసేది లేదన్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన  జనసేన అవిర్భావ సభలో ఆయన  మాట్లాడారు. ఎంతోమంది పార్టీలు పెట్టారు రాజకీయాలు తట్టు్కోలేక వదిలేశారని అన్నారు.   మీ అభిమానమే తనకు దైర్యాన్ని ఇచ్చిందని, ఆ దైర్యమే తనకు కవచమని పవన్  తెలిపారు. ఎవరైనా గెలిచేకొద్ది బలపడుతారు కానీ జనసేన దెబ్బపడే కొద్ది  బలపడుతుందని  పవన్ అన్నారు. తన ఒక్కడితో మొదలైన జనసేనకు ఇప్పుడు  రెండు తెలుగు రాష్టాల్లో 6 లక్షలకు పైగా కార్యకర్తలు ఉన్నారని పవన్  చెప్పారు.  ఏపీలో ఎప్పటికైనా జనసేన కచ్చితంగా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తుందని  పవన్ ధీమా వ్యక్తం చేశారు. 

ప్రజలకు అండగా నిలబడాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని, జనసేన దాన్ని నిలబెడుతుందని, రాజకీయ  అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామని  పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. కులాలను కలపాలన్నదే తన అభిమతమని వెల్లడించారు.  తాను కాపు కులంలో పుట్టిన అన్ని కులాలకు అండగా ఉండాలన్నది తన ధ్యేయమని తెలిపారు. అలాంటిది తాను కులాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని అన్నారు. ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు వస్తారని పవన్ చెప్పారు. కులాలకు, మతాలకు అతీతంగా తాను అండగా ఉంటాననని పవన్  చెప్పారు. తనకు తెలంగాణ సీఎం వెయికోట్లు ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారని, డబ్బులకు అమ్మడుపోయే వ్యక్తిని తాను కాదన్నారు. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సభలో చనిపోయిన కౌలు రైతు కుంటుబ సభ్యులకు పవన్  రూ. లక్ష చొప్పున అర్థిక సహయం అందించారు.