చిన్న కామెంట్కే ఇంత విధ్వంసమా.. పవన్ ఫ్యాన్సా మజాకా!

చిన్న కామెంట్కే ఇంత విధ్వంసమా.. పవన్ ఫ్యాన్సా మజాకా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan).. ఈ పేరు చెప్తే బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ అవుతాయి. ఆయన అడుగుపెడితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. జనాల్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే.. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్  వేయికళ్ళతో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ.

పాన్ ఇండియా లెవల్లో స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన ఓజీ టీజర్ ఆ అంచనాలను అమాంతం పెంచేశాయి. గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ స్టైలీష్ లుక్, సుజీత్ అదిరిపోయే టేకింగ్, తమన్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ వెరసి టీజర్ ను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టేశాయి. దీంతో ఓజీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) మూవీ ట్విట్టర్ లో ఫుల్లు ట్రెండ్ అవుతోంది. కారణం ఈ సినిమాలో నటిస్తున్న నటి శ్రీయా రెడ్డి ఓజీ మూవీపై కామెంట్స్ చేయడమే. శ్రీయ రెడ్డి తాజాగా సలార్ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శ్రీయ. ఇందులో భాగంగా ఆమె ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఓజీ ఐస్ బిగ్గెర్ దన్ సలార్(OG సలార్ కన్నా చాలా గొప్పగా ఉంటుంది). మీ ఊహకు కూడా అందనంతగా ఉంటుంది అని చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. సలార్ కే ఈ రేంజ్ లో ఉంటే.. మా OGకి గ్రౌండ్ లెవల్లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఓజీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Beta
Beta feature