V6 News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ.. టీజర్ అప్డేట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ.. టీజర్ అప్డేట్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ 'OG'. సుజీత్‌(Sujeeth) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పై అభిమానులకి భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..OG మూవీ  4వ షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తయిందని.. లీడ్స్‌తో కూడిన ప్రధాన సన్నివేశాలను షెడ్యూల్‌లో చిత్రీకరించారని.. కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని, పవన్ కళ్యాణ్ కూడా సెట్స్‌లోకి జాయిన్ అవుతారని తాజా బజ్.

అలాగే  పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా (సెప్టెంబర్ 2న) టీజర్ రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ లేటెస్ట్ బ్రో మూవీ రిలీజై.. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుండగా.. OG టీజర్ అప్డేట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో మేకర్స్ నుంచి  అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.  

సాహో(Sahoo) మూవీతో మంచి బజ్ క్రీయేట్ చేసిన సుజిత్..ఇప్పుడు పవర్ స్టార్ తో OG(Orginal Gangstar) మూవీని తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. తమిళ నటుడు అర్జున్ దాస్(Arjun Das), శ్రియ రెడ్డి(Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ తరువాత ప్రొడ్యూసర్ ధానయ్య(Daanayya) నిర్మిస్తున్న ఈ సినిమాకు..లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.