
తన నటన, అభినయంతో తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి శృతిహాసన్ (Shruti Haasan) . ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలు పంచుకోవడంలో ఎప్పుడూ ఓపెన్ గానే చెప్పేస్తోంది. ప్రియుడుతో బ్రేకప్ అయిన తర్వాత పెళ్లంటే భయమేస్తోంది.. అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్యూలో దక్షిణాదిలో ఉన్న ప్రముఖ నటుల వ్యక్తిత్వాన్ని, వారి పనితీరు గురించి ఆకస్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీపరిశ్రమ తన జీవితంలో మరిచిపోని తొలి విజయాన్ని అందించిందని శృతి హాసన్ తెలిపింది. హైదరాబాద్ తో నాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పుకొచ్చింది. తొలుత డైరెక్టర్ గా మారాలని ఆశించినప్పటికీ .. కెమెరా ముందు నటించడమే తన నిజమైన అభిరుచి అని గ్రహించానని వెల్లడించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), విజయ్(Vijay ) , ప్రభాస్ ( Prabhas) , రజినీకాంత్ ( Rajinikanth) వంటి దక్షిణాది అగ్రతారలతో కలిసి పనిచేసిన తన అనుభవాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విడుదలకు సిద్ధంగా ఉన్న రజినీకాంత్ 'కూలీ' (Coolie) మూవీలో నటించింది.
రజినీకాంత్ చాలా చురుకైన , తెలివైన వ్యక్తి , అందరి పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారని శృతిహాసన్ ప్రశంసలు కురిపించారు. సెట్ లో అందరితో సరదాగా ఉంటారు. ప్రతి ఒక్కరిలో సానుకూల శక్తిని నింపుతారు. అందరూ ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు" అని శృతి వివరించారు. ప్రస్తుతం రజనీకాంత్ ' కూలీ'లో శృతి నటించింది. గత సంవత్సరం బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో విడిపోయిన తర్వాత, శ్రుతి హాసన్ ప్రస్తుతం తనను తాను ప్రేమించుకోవడంపైనే దృష్టి సారించారు. "నేను ఇప్పుడు ఒంటరితనాన్ని అలవరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, దీన్ని లోన్లీనెస్ అని పిలవడం లేదు," అని ఆమె తెలిపారు. లోన్లీనెస్ నుంచి తప్పించుకోవడానికి ఒక బంధంలోకి దూసుకెళ్లడానికి బదులుగా, శ్రుతి తన ఒంటరితనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, ముందు తనను తాను పూర్తిగా ప్రేమించుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తన జీవితంలోకి ఇంకెవరినైనా అనుమతించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
ALSO READ : HHVM Event: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. గెస్ట్‌లు ఎవరంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' ( Coolie )లో శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున, సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే వంటి ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ ఆగస్టు 14, 2025 విడుదలకు సిద్దంగా ఉంది . ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా100 దేశాల్లో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.