HHVM Event: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్.. గెస్ట్‌లు ఎవరంటే?

HHVM Event: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్.. గెస్ట్‌లు ఎవరంటే?

పవన్ కళ్యాణ్ పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదాపడ్డ వీరమల్లు జూలై 24న థియేటర్లలోరానుంది. విడుదలకు ఇంకా 10 రోజుల సమయమే ఉండటంతో ప్రమోషన్స్లో వేగం పెంచారు మేకర్స్.

ఈ క్రమంలో ఆదివారం (జూలై 20న) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు విశాఖపట్నం సముద్రతీరాన్ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే, వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు డైరెక్టర్స్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు సినీ వర్గాల టాక్.

ఈ సినిమాకు రాజమౌళి అన్న, మరియు తన ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. అందుకే రాజమౌళి వస్తున్నట్లు టాక్. అలాగే,త్రివిక్రమ్ హీరో పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహితుడు. కనుకే, వీరిద్దర్ని నిర్మాత ఏ.ఎం.రత్నం ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. రానున్న ఈ రెండ్రోజుల్లో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన రానుంది.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటించగా, బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌. సత్యరాజ్, జిషు, సేన్‌‌‌‌‌‌‌‌ గుప్తా కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరించాడు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌  ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో విడుదల కానుంది. 

ALSO READ : Viral Video: అభిమానిపై రాజమౌళి సీరియస్.. నీకు మైండ్ ఉందా పోయిందా అంటూ..?