
‘గబ్బర్ సింగ్’ సినిమా మ్యూజికల్‌గా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని మ్యూజిక్, పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేస్తామంటున్నారు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైంది. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టామంటూ మేకర్స్ ఈ ఫొటోతో అప్‌డేట్ ఇచ్చారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.