మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క, సారలమ్మల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వనదేవతల సకల జనులను చల్లగా చూడాలని కోరుకుంటున్నానని ప్రెస్ నోట్ ద్వారా తన శుబాకాంక్షలను తెలిపాడు పవన్.

కాగా, తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. పటిష్ట భద్రత నడుమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.21న ప్రారంభం కానున్న ఈ జాతర ఫిబ్రవరి 24వరకు 4రోజుల పాటు ఘనంగా జరగనుంది. జాతర జరిగే నాలుగు రోజుల పాటు ములుగు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

మేడారం జాతర సందర్బంగా కన్నెపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. జాతర ప్రారంభోత్సవం సందర్బంగా జరిపిన అమ్మవార్ల కుంకుమ భరిణె పూజా కార్యక్రమానికి ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ జాతరకు తెలంగాణ నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.